Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పంచ్ ఫార్మేట్ ను అందుకే ఎంచుకున్నాను: హైపర్ ఆది

  • ముందు నుంచే 'జబర్దస్త్' చూసేవాడిని 
  • పంచ్ లకి ప్రేక్షకులు బాగా నవ్వడం గమనించాను
  • ఆ పంచ్ లకే ప్రాధాన్యతనిచ్చాను    
'జబర్దస్త్' లో నవ్వించడానికి ఒక్కో టీమ్ ఒక్కో పద్ధతిని ఫాలో అవుతూ ఉంటుంది. హైపర్ ఆది విషయానికే వస్తే, గ్యాప్ లేకుండగా ఆయన పంచ్ లు వేస్తూ నాన్ స్టాప్ గా నవ్విస్తూ ఉంటాడు. తాను పంచ్ లపై శ్రద్ధ పెట్టడానికి గల కారణాన్ని ఆయన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

" నేను బీటెక్ చదువుతూ ఉండగా .. ' జబర్దస్త్' చూసేవాడిని. స్టేజ్ పై డ్రామా నడుస్తూ ఉండగా పంచ్ రాగానే ప్రేక్షకులు నవ్వుకునేవారు. ఆ స్టేజ్ పై అడుగుపెట్టే అవకాశం నాకు వచ్చాక, డ్రామా ఎక్కువగా చేయకుండా, ప్రేక్షకులు ఎదురుచూసే పంచ్ లతోనే మొత్తం ఎపిసోడ్ నడిపించాలని నిర్ణయించుకున్నాను. అప్పటి నుంచి అదే ఫార్మేట్ ను అనుసరిస్తూ వెళుతున్నాను. అదే నాకంటూ ఓ ప్రత్యేకతను తీసుకు వచ్చింది" అని చెప్పుకొచ్చాడు.   
hyper aadi

More Telugu News